తెలుగు కూడలి

తెలుగు  కూడలి
తెలుగు కూడలి

Tuesday, November 15, 2011

రెండవ SRC వేస్తె నష్టం ఏమిటి ?

రెండవ SRC   వేస్తె నష్టం ఏమిటి ?

తెలంగాణా కే లాభం కదా విభజన అప్పుడు తప్పదు కదా ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ? 

Wednesday, October 19, 2011

సకల జనుల సమ్మె - సఫలమా ? విఫలమా ?

సకల జనుల సమ్మె - సఫలమా ? విఫలమా ?

సఫలం : తెలంగాణా సమ్మె లో అందరు సమ్మె చేసారు. స్కూల్స్ , మూత పడ్డాయి., అన్నీ 2 రౌండ్స్ బంద్ రైల్ రోకో , బస్ రోకో.

జరిగినది :
 లాభ పడ్డది సినిమా , దూకుడు హిట్ , ఉసరవెల్లి హిట్. అన్నీ రోడ్స్ సాయంత్రానికి సినిమా హల్లకే.
యావరేజ్ సినిమాలు సూపర్ హిట్. సాయత్రం టైం పాస్ బాగా  అయ్యింది అందరికి. ఎప్పడు సినిమా చూడని జనాలు కూడా దూకుడు చూసారు. ఉసరవెల్లి చూసారు. ఉళ్లు వెళ్ళటానికి బస్ లు లేక పోవటం. బస్ లు పగుల గోట్టటం.
హైదరాబాద్ లో అన్నీ రోడ్స్ ఖాలీ , ధియేటర్ అన్నీ ఫుల్.

 ఆటో వాలా  లు  చాలా సంపాదించారు

నష్టం : బ్రాండ్ హైదరాబాద్ చాలా దెబ్బతింది. ఐ టి ఉద్యోగాలు అంత అంత మాత్రం అవి కూడా బెంగుళూరు, చెన్నై పోయాయి.

తెలంగాణా ఇవ్వటానికి మార్గం సుగమం కాకా పోగా ఇంకా ఇబ్బంది , రాక పోవటానికి దోహద పడతొందా?

JAC చెయ్యాల్సినవి చెయ్యటం లేదు

1. మజిల్స్ తో ఎందుకు మాట్లాడారు. ఎవరు అవునన్న , కాదన్న majlis పార్టీ తో నే తెలంగాణా సాద్యం. వాళ్ళు సరే అంటేనే హైదరాబాద్ తో కూడిన తెలంగాణా వస్తుందనది నిజం , నిజం

2. All పార్టీ మీటింగ్ కు వెళ్ళాలి . చిదంబరం ని వదల కూడదు.
3. రాజకీయ పరిష్కారం కాని బంద్ ల వల్ల ఏమి సాధ్యం కాదు అని సకల జనుల సమ్మె నిరూపించింది.
4. జాతీయ స్థాయి లో ప్రయత్నిచాలి
5. సీమ ఆంధ్ర ని ఎంత తిడితే అంత వెనక్కి వెడుతుంది. అక్కడికి వెళ్ళే ప్రయత్రం, చెప్పే ప్రయత్నం ఎందుకు చెయ్యరు ?
6. పేరంట్స్ తరగ బడే వరకు ఉద్యమం చెయ్యటం ఎంత వరకు సమంజసం ? అనవసరం గా CM ని హీరో ని చేసాము. ఢిల్లీ వెళ్లి దూకుడు గా మార్చటానికి మనమే కారణం కాదా ?
7. అసలు తెలంగాణా citizen అనే దాన్ని define చెయ్యాలి. అంటే.. సెట్టేలేర్స్ ఎప్పటి నుంచి ఉన్న వాళ్ళని సెట్ట్లేర్స్ అని అనాలి. తెలగాణా రాక పోవటానికి ఇదే పెద్ద అడ్డంకి గా మారిందా ?
8.మళ్ళి బంద్ లు ఎప్పడు స్టార్ట్ అవుతుందో తెలియదు. పార్లమెంట్ లో ఏందుకు ట్రై చెయ్యట్లేదు ?
9. హైదరాబాది మాత్రం , tdp  వైపు చూస్తున్నాడు ?
10. సఫలమా ? విఫలమా ? నిజం గా అంటూ చిక్కని ప్రశ్న.
కాంగ్రెస్ ఏమి చెప్పగలదు ? మన రాజి మార్గాలు ఏమిటి ? అందరు ఒకే నాయకత్వాని అంగీకరించటం లేదు అద్వాని తీరు అర్ధం కాదు. ప్రస్తుతం ఈ విద్య సవత్సరం ఎలా గడుస్తుందో అర్ధం కావటం లేదు. కనీసం మే 2012 వరకు బంద్ లో లేకుండా ఉంటేనే ...





Wednesday, August 3, 2011

రంజాన్ మాసం లో బంద్ లు

పవిత్రమిన రంజాన్ మాసం
హైదరాబాద్ కు కష్టాలు

సర్వ జనుల సమ్మె, రోజుకో పేరు తో సమ్మె.
తెలంగాణా పరిష్కారం లో ప్రధాన భాగస్వామ్యం మన ముస్లిమ్స్ దే.

ఇక బంద్ లు చాలు.

పరిష్కారం రాజకీయం గానే జరగాలి. 

Friday, March 11, 2011

ఉద్యమం దారి తప్పుతోందా ? తప్పిందా ?

తెలంగాణా కావాలని చేసిన ఉద్యమం అందరు ఆమోదించారు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా దాని ప్రాధాన్యత ను గుర్తించింది. అన్ని రాజకీయ పార్టీస్ ఇచ్చిన లేఖల ఆధారం గా ఇచ్చిన డిసెంబర్ 9 2009 ప్రకటన దాని ప్రభావమే. డిసెంబర్ 23 ప్రకటన కూడా తెలంగాణా కీ వ్యతిరేకం కాదు. జనవరి 5 2010 శ్రీ కృష్ణ కమిటి కూడా దానికీ  ప్రాధన్యం ఇచ్చింది. ఒక సంవత్సరం తర్వాత వచ్చిన కమిటి రిపోర్ట్ కూడా తెలంగాణా ప్రజల కోరిక బలం గానే చెప్పింది. కేంద్రం దానిని త్వరగా పరిక్షక్రించాలని చెప్పింది.

కేంద్రం మనకు ఇచ్చిన అవకాశాలు ఎందుకు వదులు కొంటున్నాము. అన్ని పార్టీస్ మీటింగ్  జనవారి 2011 బహిష్కరించాము. మళ్ళి మీటింగ్ మీద వత్తిడి తెచ్చే వాళ్ళము కదా. వెళ్లి ఉంటె.

కాని జరుగుతున్నది మళ్ళి ఉద్యమ ప్రారభం. చిదంబరాన్ని వదిలి మనం పార్లమెంట్, అసెంబ్లీ ని అడ్డుకోవటం పూర్తిగా అసంబద్దం.

సహాయ నిరాకరణ మన  దేశం లో స్వతత్ర్యం వచ్చిన తర్వాత ఎప్పుడు సరిగ్గా జరగలేదు. మనమే నష్టపోయాం దాని మూలంగా. అవి అన్నీ కేంద్ర పరిధి లోనివి అని తెలిసి ఉద్యమం ఎందుకు చేసినట్లు ? ఎందుకు విరమించి నట్లు. ప్రజలలో కిరణ్ ప్రభుత్వం ఫై సింపతి వచ్చింది దీని మూలంగా

 కీవలం బంద్ చెయ్యాలని తప్పించి వేరే ప్రయోజనం కనబడ లేదు. వాస్తవాలకు దూరం గా మన ఉద్యమము పోతోందా ?

మిల్లినియం మార్చ్ ఇప్పుడు అవసరమా. కేవలం పట్టుదలకు పోయి చేయటం తప్ప. పిల్లలు, వారి తల్లి దండ్రులు ఎంతగా చెప్పినా ఎందుకు చేస్తున్నట్లు ? దయచేసి ఎగ్జామ్స్ అయ్యేవరకు, జూన్ వరకు ఆందోళనలు లేకుంటే బాగుండు.

అసలే క్రికెట్ ఫీవర్, వరల్డ్ కప్. ఆ తర్వాత ఐ పి ల్ వరస వరస పిల్లల చదువులు పాడు చేస్తున్నాయి. మళ్ళి ఉద్యమాల జోరు.

నాకు తెలిసి చెయ్యాల్సిన వన్ని రాజకీయం గా నే చెయ్యాలి. ఆందోళనలు మనకే నష్టం. ఇప్పటికే కేంద్రం లో ఎవ్వరు కలవటానికి, కనీసం  Appointment ఇవ్వటానికి , ప్రణబ్, సోనియా .........

జూన్ వరకు చెయ్యాల్సిన పనులు.

చిదంబరాన్ని వదలకూడదు అయన మన దేవుడు. పార్టీ వేరు ప్రభుత్వం వేరు అని గుర్తించాలి. రాత్రికి రాత్రి తెలంగాణా  రాదు అని చేప్పె వరకు మనమే తెచ్చాము. ఆయన్ని నమ్ముకోకుండా.

అయన లిస్టు ప్రకారం అరవ సూత్రమే ప్రయోగిస్తాడు ఇప్పుడు. గట్టిగా అడిగితే మీ పార్టీలు తప్పుడు సమాచారం ఇచ్చాయి అంటాడు. ఆరవ సూత్రం అమలు కాకుండా ఇదు ప్రయోగించరు.  కేంద్రం దానికే మొగ్గు చూపుతుంది.

కేంద్ర నిర్ణయం రాకుండా ఆందోళనలు ఏమిటి ? సహకరించకుండా మళ్ళి ఉద్యమమాలతో ఎవరికీ నష్టం. ? ఇప్పటికే అందరు బెంగళుర్ బాట పట్టారు.

 చిదంబరం , రాహుల్ మాత్రమే తెలంగాణా కోసం పనిచేసేది. మనకు ఇప్పుడు ఎలా రాష్ట్రాన్ని విడగొడతారు అనే దాని మీద ఒక కమిషన్ వేసేలగా వత్తిడి తేవాలి. రేపు బిల్ పెడితే అది మనకు పనికి వస్తుంది శ్రీ కృష్ణ కమిటి దీని గురంచి ఏమి చెప్పలేదు

అసెంబ్లీ కీ వెళ్ళాలి వెళితే అక్కడ ఆంధ్ర ప్రాంత నాయకులతో చర్చ్చించాలి. మనం ఏమి త్యాగం చెయ్యగలమో ఆలోచించాలి మనకు తెలంగాణా కావాలా , హైదరాబాద్ మీద ఎంత వరకు మనం పట్టు పట్టాలి.

వట్టి చేతులతో ఆంధ్ర రాష్ట్రము ఏర్పడదు ఒకసారి మద్రాస నుంచి వచ్చి మళ్ళి వట్టి చేతులతో వెళ్లేందుకు ఎవరు సిద్దం గ లేరు.

మన ముస్లిం సోదరులు ఇంకా సమైక్యం అంటూనే ఉన్నారు,వారు మనతో కలవంత వరకు మనకు తెలంగణ రాదు. వాళ్ళ కు సమ్మతం కాకుండా తెలంగాణా రాదు. మన నేతలు వాళ్ళను కలవటానికీ ఎందుకు వెనుకాడుతున్నారు ?
తీర ప్రాంతం లేని రాష్ట్రం మనకే నష్టం, భట్టి సూచన కూడా మంచిదే. వీలుంటే కర్నూల్ కూడా అడగాలి

నిన్న జరిగింది ఎలాటిది అయిన మనం క్షమార్పణ చెప్పాల్సిందే.

బిల్లు , బిల్లు పెట్టాలి అంటున్నారు. అసలు ఇంతవరకు చిదంబరం సంగతి మర్చిపోయారు. బిల్లు స్వరూపం తెలియకుండా ఎలా పెడతారు? ఓడిపోతే ఎవరికీ నష్టం బి జే పి ది  కేవలం సాను భూతి మాత్రమే

బిల్లు ముఖ్యం కాదు, బి జే పి ని వదిలి కాంగ్రెస్ తో నీ కలవాలి. ఉద్యమం నాయకుల చేతోల్లో నుంచి ప్రజల చేతుల్లోకి వెళ్లటం న్యాయమే కాని నిన్న జరిగింది మాత్రం పెద్ద తప్పె. విగ్రహలకే రక్షణ లేనప్పుడు ప్రజలకు తెలంగణ ఏమి రక్షణ ఇస్తుంది ?

అన్నీ పార్టీస్ మళ్ళి ఒకసారి ఏక అభిప్రాయానికి ట్రై చెయ్యలేరా ? బాబు , సోనియా తో పేస్ 2  పేస్ మాట్లాడితే దీనికి సోల్యుషన్ దొరకదా. కే సి ర్ , అందర్ని కలుపుకు పోవాలి

ఇంకో సంఘటన జరిగితే గవర్నర్ రులే అది మనకు చాల నష్టం ప్రస్తుత పరిస్తితులలో రాజకీయం గా అందరూ ఆలోచిస్తున్నారు సమస్య పరిష్కారానికి కాదు.

మన విధానాలే మనకి  అడ్డంకి గా మనకు మారబోతోందా. మనం మారాలి రాష్ట్ర స్థాయి లో చర్చల తర్వాతే బిల్లు







Thursday, March 3, 2011

ఉద్యమాల మధ్యన హైదరాబాది

మేము కళ్ళు తెరిచేతపటికి ఆంద్ర ప్రదేశ్ లో ఉన్నాము,హైదరాబాద్ లో పుట్టాము.

మేము ఎప్పుడు తెల్గుర్డు మట్లాదే వాళ్ళం. ఎవరైనా ఆంధ్ర నుఆచి వస్తే మాత్రమే తెలుగు లేకపోతె ఉర్డు.

మాకు అంతకుముందు జరిగిన ఉద్యమాలు మాకు  తెలియవు, మా పాట్య పుస్తకాలలో కూడా వాటి ప్రస్తావన లేదు. మాకు తెలిసి ఇదే లోకం గా భావించాము. ఎవరు వచ్చిన ఆదరించాము. మాకు తెలంగాణా తెలియదు, ఆంధ్ర తెలియదు. మా బాల్యము హాయి గా గడిచింది.

ఎక్కడా బయోదేట లో హైదరాబాద్ అని మాత్రమే రాసాము. ఆంధ్ర అని తెలంగాణా అని రాయలేదు.

అన్నిటికి హైదరాబాద్ పేరే పెత్తుకోన్నాము. బిర్యాని కీ , చాయ్ కీ .... చర్మాస్ కీ

రామారావు వచ్చాడు అప్పటిదాకా ఉర్దూ లో మాట్లదేమేము తెలుగు లోకి మారాము. తెలుగు అన్ని చోట్ల వచ్చింది రైల్ , బస్సు మీద. మేము అభివృద్ధి లోకి వచ్చాము అనిపించింది. తెలంగాణా నాది రాయలసీమ నాది అన్ని నావే అన్నాడు. గుడ్డి గా నమ్మాము. మా రాజకేయ నాయకులను వదిలి రామారావు కీ వోట్ వేసము

చెన్న రెడ్డి తెలుగు సినిమా అంతా హైదరాబద్ తెచ్చారు. నటులను దగ్గరనుండి చూసాము. దూరదర్శన్ వచ్చినది. క్రికెట్ ఆడటం చూడటం అందరు హైదరాబద్ వైపు చూడటం

బాబు వచ్చాడు. ఐ టి మొత్తం తెచ్చాడు. హైదరాబద్ బెంగుళూరు ని మించి  పోయింది అన్నారు. మేము ఆనందపడ్డాము. మాకు హైదరాబాది అనే గుర్తింపు వచ్చింది

వై స్స్ వచ్చిన తర్వాత మా గురిచి 5 ఏళ్లు ఏ గొడవలు లేవు. ఉన్న పట్టించోకోనంత

ఎవరు ముఖ్యమంత్రి అయినా మాకు భాద లేదు. కల్చర్ మారిన భాద పడలేదు. మాకు అదోళనలు తెలియవు
అన్నిటికి మేమే వేదిక. వేలిగోపోతోంది అనే వాళ్ళు


2009 డిసెంబర్ వరకు మా హైదరాబద్ చరిత్ర తెలుసోకోవాల్సిన అవసరం లేకుడా పోయింది. అందర్ని మేము కలుపుకు పోయాము. మైనారిటి, మెజారిటి భేదమే లేదు. ఎవరు మీటింగ్ పెట్టుకొన్న మాకు ఇబ్బంది లేదు

కాని మా గురించి మీరు కొట్టుకొంటున్నారు. మీరు అందరు వచ్చి హైదరాబద్ అభివృద్ధి చేస్తే  సంతోషించాము. మా పిల్లలకు కూడా హైదరాది గానే పెంచాము. అన్ని పండగలు చేసుకొంటారు.మేము ఎక్కడికి వెళ్ళకుండా అన్ని ఇక్కడికే వచ్చాయి

వాళ్ళకి నిజం గా ఆంధ్ర తెలియదు. తెలంగాణా తెలియదు. వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానాలు లేవు. మన హైదరాబద్ గురించి అందరు ఎన్దుకు కొట్టుకొంటున్నారు ?

మనని ఎవ్వరు అడగరా అని. శ్రీ కృష్ణ కమిట్టీ కూడా మన అభిప్రాయం అడగలేదు. మనకు ఏమి కావాలి అని ?

గత రెండు ఏళ్లుగా ఉద్యోగాలు పోయాయి. కొత్తవి రావటమే లేదు. అందరూ బెంగుళూరు బాట పట్టారు.

 మా ముస్లిం సోదరులు గట్టి గానే  చెప్పారు ఏమి కావాలో.  ఎప్పటి దాక మేము ఎప్పుడు వాళ్ళకు వోట్ వెయ్యలేదు. ఎప్పుడు వాళ్ళు చాల క్లారిటి టో ఉన్నారు.

మేమే..... మాకు మా గమ్యం ఎమోటో ......... మమ్మల్ని ఏమని పిలవాలి ?


అన్ని ఎగ్జామ్స్ టైం లోనే క్రికెట్ , ఐ పి ల్ , ఉద్యమాలు. చదవాలో  లేదో తెలియటం లేదు. ఉంటాయో లేదో తెలియటం లేదు. పిల్లలకి

మా గురించి ఆలోచించే సమయం ఎవ్వరికి లేదు. మేము హైదరాబాది అని మర్చిపోయే రోజు దగ్గిరలోనే ఉందా ?
మేము ఆనంద పడ్డ ప్రతిది కరిగి పోతూంది.

నాకు తెలిసి హైదరాబాద్ స్టేట్ ఉండేది. అదే మళ్ళి ఇస్తే ........ హైదరాబ్ది హ్యాపీ


Tuesday, February 15, 2011

రెండవ రాజధాని కావలి

ఆంధ్ర ప్రదేశ్ కు రెండవ రాజధాని కావలి. ఎప్పటికినా రాష్ట్రము విదిపోవాల్సిందే కనీసం  2025 కి
ఆంధ్ర ప్రాంత నాయకులూ కళ్ళు తెరవండి మీకోసం కాదు కనీసం మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించండి
హైదరాబాద్ తోపాటే రెండవ రాజధాని తయారు చెయ్యండి


జనాభా 10 కోట్లు వరకు వచ్చేసింది

10 ఇయర్స్ లో కొత్త రాజధాని రెడీ అవ్వగానే తెలంగాణా ప్రకటించ వచ్చు
ఒక భాష రెండు  రాజధానులు నష్టమేమి లేదు ఎక్కువ ఉద్యోగాలు ఎక్కువ పని

భయపెట్టకుండా కెసిఆర్ మరియు తెలంగాణా వాదులు ఆంధ్ర , సీమ ప్రాంతాలకు వెళ్లి ప్రజలకు చెప్పాలి


శ్రీ కృష్ణ కమిటీ 6th option  
రెండవ రాజధా ఎందుకు అలోచిచలేదు ?

Wednesday, February 9, 2011